బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా.. ఫ్యామిలీ మొత్తానికి కరోనా!
on Jan 5, 2022

భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు.
తనతో పాటు తన కుటుంబానికి కరోనా సోకిందని తెలుపుతూ తాజాగా మీనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మా ఇంటికొచ్చిన మొదటి అతిథి కరోనా అంటూ ఈ విషయాన్ని ఆమె ఎంతో సరదాగా చెప్పారు. "2022లో మా ఇంటికి వచ్చిన మొదటి అతిథి మిస్టర్ కరోనా. అది మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, దానికి నేను మా ఇంట్లో చోటు ఇవ్వను. మీరంతా జాగ్రత్తగా ఉండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి.బాధ్యతగా ఉండండి" అంటూ మీనా ట్వీట్ చేశారు. కరోనా నుంచి మీనా కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు ఆమె ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు.

కాగా ఇటీవలి కాలంలో కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, నోరా ఫతేహి, మంచు మనోజ్, విశ్వక్ సేన్ ఇలా ఎందరో సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



