బిగ్ షాక్.. 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా!
on Jan 1, 2022

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. జనవరి 7 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కరోనా విజృంభణ కారణంగా విడుదల వాయిదా పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేస్తున్నామని తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
సెకండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ కావడం, పలు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో మళ్ళీ సినీ పరిశ్రమకి మంచి రోజులు వచ్చాయని భావించారంతా. కానీ ఊహించని విధంగా కొద్దిరోజులుగా పరిస్థితి మారిపోయింది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాలలో థియేటర్స్ తాత్కాలికంగా మూత పడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి. ఈ ప్రభావం బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా మూవీలపై ఎక్కువగా పడుతుంది. ఇప్పటికే డిసెంబర్ 31 న విడుదల కావాల్సిన హిందీ జెర్సీ వాయిదా పడింది. తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది.

"ఎంతో కష్టపడి పనిచేసినా.. కొన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్ లో ఉండవు. అనేక రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడుతుండటంతో.. సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప మరో మార్గం లేదు. కాస్త ఆలస్యమైనా.. సరైన సమయంలో ఇండియన్ సినిమా వైభవాన్ని మళ్లీ తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం" అని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో జనవరి 14 న విడుదల కావాల్సిన మరో పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



