అమెరికా అధ్యక్ష స్థానంపై రేణూ దేశాయ్ ప్రశ్నలు..!
on Jun 9, 2016
.jpg)
రేణు దేశాయ్ పవన్ మాజీ భార్య గానే చాలా మందికి తెలుసు. స్త్రీల హక్కులు, పేదరికం లాంటి ఎన్నో సామాజిక సమస్యలపై గొంతెత్తడంతో పాటు, సాయం చేయడంలో కూడా ఆమె ముందుంటుంది అనేది మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. రీసెంట్ గా అమెరికా లోని అధ్యక్ష ఎన్నికల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది రేణు.

అమెరికాను అగ్రరాజ్యంగా పేర్కొంటారు. స్వేచ్ఛాదేశం అని, ఫ్రీ కంట్రీ, స్త్రీ పురుష సమానత్వం ఉన్న దేశమని అంటుంటారు. మరి అలాంటి అమెరికా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మహిళా అధ్యక్షురాలు ఎందుకు లేదు అని ప్రశ్నించింది రేణూ దేశాయ్. ఇప్పుడు జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్ అర్హత సాధించిన నేపథ్యంలో, రేణు ఈ వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా మహిళా అధ్యక్షురాలు పనిచేశారు. కానీ అమెరికా కు ఇప్పటి వరకూ ఇలాంటి అవకాశం కలగలేదు. అందుకే హిల్లరీని ఎంపిక చేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదంటూ ట్వీట్ చేశారు రేణు. కరెస్టే మరి. స్త్రీ గౌరవం గురించి, సమానత్వం గురించి మనకు లెక్చర్లు దంచే అమెరికన్లు ఇప్పటి వరకూ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోలేదంటే ఆశ్చర్యమే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



