అమీర్ ను ఆకాశానికెత్తేసిన అనిల్..!
on Jun 9, 2016

బాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్నాడు అనిల్ కపూర్. ఆ తర్వాత కెరీర్ డౌన్ అయిపోవడంతో, కీలక పాత్రలకు, బుల్లి తెరకు పరిమితమైపోయాడు. అనిల్ డౌన్ అయిపోయినా, కూతురు సోనమ్ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తోంది. ఇక ఇప్పుడు తన కొడుకును కూడా హీరోగా తీసుకొస్తున్నాడు అనిల్ కపూర్. ఆయన కొడుకు హర్షవర్ధన్ కపూర్ బాలీవుడ్ లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు. కొడుకును లాంఛ్ చేస్తున్న అనిల్, అక్కడే ఉన్న మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ను తనయుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం విశేషం. తనకంటే అమీర్ వయసులో చిన్నవాడైనా, తనకు కూడా అతను ఆదర్శప్రాయమని, అమీర్ ను చూసి తాను ఇన్ స్పైర్ అవుతుంటానని చెబుతున్నాడు అమీర్. తాను హిందీ ఇంగ్లీష్ ప్రొగ్రామ్స్ తో బిజీగా ఉంటే, అమీర్ ' సత్యమేవ జయతే ' లాంటి సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమాల్ని చేసుకొచ్చాడని, ఇలా వైవిధ్యంగా ఆలోచించబట్టే అమీర్ ఈ స్థాయిలో విజయాల్ని సాధిస్తున్నాడని కితాబిచ్చాడు అనిల్ కపూర్. ఈగోలు టాప్ స్టేజ్ లో ఉండే సినీ ఫీల్డ్ లో ఇలా ఒక హీరో మరో హీరోను పొగడటం చాలా మంచి విషయం అంటున్నారు సినీజనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



