దండపాణి బాబా ఆలయంలో రేణు దేశాయ్ ఏం చేశారంటే...
on Dec 4, 2025

రేణు దేశాయ్ ఏది చేసిన అందులో ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. అంటే ఎవరో చూస్తున్నారనో ఆమె ఏ పని చేయరు. ఆమెకు ఏదనిపిస్తే అదే చేస్తారు. రీసెంట్ గా ఆమె కాశీ పుణ్య క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆమెకు ఎంతో ఇష్టమైన దండపాణి బాబా ఆలయంలో చెత్తను శుభ్రం చేశారు. ఐతే ఎవరో ఒక వ్యక్తి దాన్ని వీడియో తీశారు. "నేనెప్పుడూ ఆలయానికి ఒంటరిగా వెళ్లి అక్కడ ఏదో ఒక సేవ చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడూ వీడియో తీసుకోలేదు. ఐతే ఈసారి ఒకామె నాతో ఉండి వీడియో తీశారు. ఈ వీడియో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని అప్పుడు టెంపుల్స్ ని క్లీన్ చేసే దిశగా సమాయత్తం అవుతారని చెప్పారు" అంటూ రేణు దేశాయ్ ఆ వీడియో దగ్గర ఈ వాక్యాలను పోస్ట్ చేశారు. " నాకు రెండవ ఇష్టమైన దండపాణి బాబా ఆలయంలో (మొదటి ఇష్టమైనది కాలభైరవుడు) సేవ చేస్తున్నప్పుడు వీడియో తీయడం వింతగా అనిపించింది.
కానీ ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుందని అనిపించింది. అందుకే మీరు సిగ్గుపడటం మానేసి మీ ఇంటి చుట్టూ ఉన్న దేవాలయాలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్‌లో కూడా దీన్ని చేయాలనుకుంటున్నాను కానీ ఇక్కడ చేస్తున్నంత హాయిగా చేయడం నాకు సులభం కాదు..కాబట్టి మన ఆలయాలను మనమే శుభ్రం చేసుకోవాలి..హర్ హర్ మహాదేవ్ " అని చెప్పారు రేణు దేశాయ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



