నెక్స్‌ట్ ఏంటి.. కరేబియన్ ఐలాండ్‌లో ఐబొమ్మ రెస్టారెంట్!
on Dec 4, 2025
- 17 కోట్లతో 86 దేశాలు చుట్టిన రవి
- కరేబియన్ ఐలాండ్ అంతటా ఐబొమ్మ రెస్టారెంట్లు
- ఐబొమ్మ సంపాదన ఎంజాయ్ చెయ్యడానికే
పైరసీతో సినిమా పరిశ్రమను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు ఇమ్మడి రవి. పోలీసు కస్టడీలో అనేక వివరాలను రవి నుంచి రాబట్టారు పోలీసులు. అందులో భాగంగానే తన భవిష్యత్ ప్రణాళికలను కూడా తెలిపాడు రవి. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఐబొమ్మ ద్వారా సంపాదించిన 17 కోట్ల రూపాయలు తను ఎంజాయ్ చెయ్యడానికే ఖర్చు చేశానని, ఆ డబ్బుతోనే 86 దేశాలు చుట్టి వచ్చానని చెబుతున్నాడు రవి. ప్రస్తుతం ఐబొమ్మ సైట్‌ను క్లోజ్ చేశారు కాబట్టి తన తదుపరి ఆలోచన రెస్టారెంట్ అని పోలీసుల విచారణలో రవి తెలిపాడు. ఇండియన్ డిషెస్‌ను కరేబియన్ ప్రజలకు పరిచయం చెయ్యాలని ఉందని, అందుకే అక్కడ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నాడు.
కరేబియన్ ఐలాండ్‌లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ బ్రాంచ్‌లను విస్తరిస్తానని అంటున్నాడు రవి. ఇప్పటికే అతన్ని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతనికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అయితే కోర్టులో ఈ కేసు విచారణ ఎలా ఉంటుంది? రవి తరఫు న్యాయవాది వాదన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇమ్మడి రవి కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, కోర్టు తీర్పు ఎలా వుండబోతుంది అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



