`ఖిలాడి` టు `రావణాసుర`.. రవితేజ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ!
on Jan 10, 2022

గతేడాది సంక్రాంతి సంచలనం `క్రాక్`తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని తన ఖాతాలో వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ చేతిలో ఐదు చిత్రాలున్నాయి. `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు`.. టైటిల్స్ తో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో `ఖిలాడి` ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమవగా, `రామారావు ఆన్ డ్యూటీ` మార్చి 25న రిలీజ్ కి రెడీ అవుతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ఖిలాడి` నుంచి `రావణాసుర` వరకు రవితేజ చేస్తున్న నాలుగు వరుస చిత్రాలు ఓ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీతో రాబోతున్నాయి. అదేమిటంటే.. ఈ నాలుగు సినిమాల్లోనూ మరో కథానాయకుడు కూడా భాగమవడం.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఖిలాడి`లో నిన్నటి తరం అగ్ర కథానాయకుడు అర్జున్ ఓ ముఖ్య పాత్రలో నటించగా.. `రామారావు ఆన్ డ్యూటీ`లో `స్వయంవరం`, `చిరునవ్వుతో` చిత్రాలతో పాపులర్ అయిన హీరో వేణు తొట్టెంపూడి కీలక వేషంలో కనిపించబోతున్నాడు. ఇక `ధమాకా`లో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ స్పెషల్ రోల్ లో దర్శనమివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. త్వరలో పట్టాలెక్కనున్న `రావణాసుర`లో తమిళ యువ కథానాయకుడు విష్ణు విశాల్ ఇంపార్టెంట్ రోల్ లో ఎంటర్టైన్ చేయబోతున్నట్లు బజ్.
మొత్తమ్మీద.. `ఖిలాడి` నుంచి `రావణాసుర` వరకు రవితేజ చిత్రాల్లో మరో హీరో కూడా ముఖ్య పాత్రలో వినోదాలు పంచనున్నారన్నమాట. మరి.. `టైగర్ నాగేశ్వరరావు`లోనూ ఇదే శైలి కొనసాగుతుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



