రామ్ గోపాల్ వర్మ దగ్గరకి పంపించి తప్పు చేశాను
on Aug 7, 2025

దర్శకులకి స్టార్ డమ్ తెచ్చిన వాళ్ళల్లో 'రవిరాజా పినిశెట్టి'(RaviRaja pinisetty)కూడా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తన సినీ జర్నీలో మెజారిటీ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాయి. యముడికి మొగుడు, జ్వాల, దొంగపెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, యం ధర్మరాజు ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య, వీడే ఇలా సుమారు నలభై చిత్రాల వరకు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.
రీసెంట్ గా రవిరాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మా పెద్ద అబ్బాయి సత్య ప్రభాస్(Sathya Prabhas)దర్శకుడు కావాలని అనుకుంటున్నానని చెప్తే, రామ్ గోపాల్ వర్మ(Ram Gopal varma)దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ చెయ్యడానికి పంపించాను. . అదే నా తప్పయ్యింది. వర్మ మా వాడితో ఎవరి దగ్గరో చెయ్యడం ఎందుకు, దర్శకత్వం అనేది ఎవరి దగ్గరో నేర్చుకొని చేసేది కాదు, సినిమాలు బాగా చూడు, మీ నాన్న దర్శకుడు, నీకు అనిపించిన కథతో సినిమా చేసెయ్యి. అంతే కానీ ఒకరి దగ్గర వర్క్ చేసి టైం వేస్ట్ చేసుకోకని బ్రెయిన్ మొత్తం వాష్ చేసి పంపించేసాడని రవిరాజా చెప్పుకొచ్చాడు
సత్య ప్రభాస్ తన మొదటి మూవీగా 'మలుపు'(Malupu)అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన మలుపు 2015 లో తెలుగుతో పాటు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. నలుగురు స్నేహితుల కథతో అనుక్షణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగగా, ఆది పినిశెట్టి(Aadhi pinisetty),నిక్కీ గల్రాని జంటగా చేసారు. బాలీవుడ్ లెజండ్రీ యాక్టర్ 'మిథున్ చక్రవర్తి' కీలక పాత్రలో కనిపించగా రవిరాజా నే నిర్మాతగా వ్యవహరించాడు. ఆది పినిశెట్టి రవిరాజా రెండో కుమారుడు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



