ఓటీటీ సంస్థలకు షాక్ ఇచ్చిన ‘నరసింహ’!
on Aug 7, 2025
సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో నిర్మాతలు కూడా ఓటీటీలపై ఎక్కువ ఆధారపడుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఓటీటీ సంస్థలు నిర్మాతలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్‌లను కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ రైట్స్ అగ్రిమెంట్స్ జరిగిపోతుండడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో నిర్మాతలు కూడా ఓటీటీ చెప్పిన కండిషన్స్‌కి తలొగ్గక తప్పడం లేదు. కానీ, ఇప్పుడు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ‘మహావతార్ నరసింహ’ ఓటీటీ సంస్థలకు పెద్ద షాక్ ఇచ్చింది.
హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమాలను ముందే బుక్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ఉత్సాహం చూపిస్తుంటాయి. మహావతార్ నరసింహ చిత్రం ఓటీటీ డీల్ జరగకముందే రిలీజ్ అయింది. ఎవరూ ఊహించని కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ సినిమా కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఫైనల్‌గా జియో హాట్‌స్టార్ ఓటీటీ హక్కులు దక్కించుకుందని, నాలుగు వారాల్లో స్ట్రీమింగ్ కూడా జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. బయట జరుగుతున్న ఈ ప్రచారానికి మహావతార్ నరసింహ టీమ్ చెక్ పెట్టింది. థియేటర్లలో అద్భుతంగా రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఓటీటీ హక్కులు ఇచ్చే ఆలోచన లేదని చిత్ర యూనిట్ తేల్చిచెప్పింది. థియేటర్‌లో రన్‌ని బట్టి తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



