'క్రాక్' గురించి ఎక్కువగా మాట్లాడిన రవితేజ!
on Jan 7, 2021
సాధారణంగా తన సినిమాల గురించి ఒకట్రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడు రవితేజ. మూడు నిమిషాలు మాట్లాడాటంటే ఎక్కువ మాట్లాడినట్లు. అట్లాంటిది 'క్రాక్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఐదు నిమిషాలకు మించి మాట్లాడాడు. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ వస్తున్న ఆయన 'క్రాక్'తో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాననే నమ్మంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఆయన బాడీ లాంగ్వేజ్‌లో, ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన 'క్రాక్' మూవీ జనవరి 9న విడుదలవుతోంది.
రవితేజ మాట్లాడుతూ, "కాసర్ల శ్యామ్ రాసిన బిర్యానీ సాంగ్, రామజోగయ్య శాస్త్రి రాసిన మూడు పాటలకూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రకని డైరెక్షన్‌లో 'శంభో శివశంభో' సినిమా చేశాను. నా కెరీర్‌లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో అదొకటి. నాకెంతో ఇష్టమైన సినిమా. ఈ సినిమాలో తనతో కలిసి నటించాను. యాక్టర్‌గా తను ఎంత బిజీగా ఉన్నా, రాయడం మాత్రం మానలేదు. ఆయనలోని గొప్ప విషయం అది. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ చాలా బాగా రాశారు. అప్సరా రాణితో చేసిన స్పెషల్ సాంగ్ 'భూమ్ బద్దల్' అవుతుందనే అనుకుంటున్నా. సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణుతో పనిచేయడం ఎంతబాగుందో! అతను మన సినిమాకు పనిచేస్తున్నాడని డైరెక్టర్ గోపీచంద్ చెప్పగానే చాలా హ్యాపీ ఫీలయ్యాను." అన్నాడు.
ఫైట్స్ మాస్టర్స్ ద్వయం, కవలలు రామ్-లక్ష్మణ్‌లను రవితేజ తెగ మెచ్చుకున్నాడు. "మా బంగారాల్లాంటి ట్విన్స్ రామ్-లక్ష్మణ్ సినిమా సినిమాకీ ఎదుగుతూనే ఉన్నారు. టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు. ఫైట్స్ విషయంలో సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. 100 పర్సెంట్ పాజిటివిటీ ఉండేవాళ్లు చాలా తక్కువమంది. వారిలో రామ్-లక్ష్మణ్ ఉంటారు. వాళ్లలో నెగటివిటీని ఇంతవరకూ చూడలేదు. ఒకరి గురించి బ్యాడ్‌గా మాట్లాడటం ఎప్పుడూ వినలేదు." అని ఆయన చెప్పాడు.
అలీ కాంబినేషన్‌తో తను చేసిన సినిమా లేదీ ఫ్లాప్ కాలేదనీ, అన్నీ బాగా ఆడాయనీ రవితేజ అన్నాడు. "తమన్ మరోసారి బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చాడు. వెరీ హ్యాపీ. హిట్‌కీ, ఫ్లాప్‌కీ సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి మ్యూజిక్కే ఇస్తాడు. డైరెక్టర్ మలినేని గోపీచంద్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అనే ఫీలింగ్ మా అందరిలోనూ అప్పుడే వచ్చేసింది." అని ఆయన చెప్పుకొచ్చాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
