ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకలో 'నాటు' డాన్స్‌తో ఊపేసిన రష్మిక!
on Apr 1, 2023
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ "నాటు నాటు"తో పాటు 'పుష్ప'లో తన పాపులర్ సాంగ్ "సామి సామి"కి డాన్సులు వేసిన రష్మిక ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
దేశంలోని నేటి బెస్ట్ పర్ఫార్మర్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఒకరు. మార్చి 31న ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా, సింగర్ అరిజిత్ సింగ్‌తో కలిసి ఆమె ప్రేక్షకులను అలరించింది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇందులో 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ఆస్కార్ విన్నింగ్స్ సాంగ్ "నాటు నాటు", 'పుష్ప' మూవీలో తనే డాన్స్ చేసిన "సామి సామి" సాంగ్‌కు హట్ అండ్ సెక్సీ పర్ఫార్మన్స్‌తో అదరగొట్టి అందర్నీ మెస్మరైజ్ చేసింది రష్మిక.
ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రష్మికను ప్రశంసిస్తూ నెటిజన్లు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు "సామి సామి" సాంగ్‌కు స్టీప్పులు వేసీ వేసీ అలసిపోయానని చెప్పిన రష్మిక మరోసారి ఆ సాంగ్‌కు తనదైన సిగ్నేచర్ స్టైల్లో డాన్స్ చేసి ప్రేక్షకుల్ని ఒర్రూతలూగించింది. ఇక "నాటు నాటు" సాంగ్‌కు ఆమె డాన్స్ చేస్తుంటే స్టేడియం హోరెత్తిపోయింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
