జేమ్స్ బాండ్ మూవీ లొకేషన్‌లో ప్రభాస్!
on Apr 1, 2023
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నది పాత కాలం మాట. ఇప్పటి మాటేంటో తెలుసా? కలిసొచ్చే కాలం వస్తే, నిన్నమొన్నటిదాకా హాలీవుడ్ హీరోల సినిమాల్లో చూసిన లొకేషన్లలో మనవాళ్లు తిరగవచ్చన్నమాట. ఈ మాటను ముమ్మాటికీ నిజం చేస్తున్నారు ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్. ఆయన ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న లొకేషన్ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అందుకు రీజన్, ఆ లొకేషన్‌లో ఇంతకు ముందు జేమ్స్ బాండ్ సినిమాలను తెరకెక్కించడమే.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఇటలీలో తెరకెక్కిస్తున్నారు. సలార్‌లో ప్రభాస్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్ కంపెనీ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సినిమా ఇది. 2021 జేమ్స్ బాండ్ సినిమాలో చూసిన సౌత్ ఇటలీలోని ఫేమస్ ప్రీ హిస్టారిక్ వైట్ వాష్డ్ కేవ్స్ మటేరాలో సలార్ షూటింగ్ జరుగుతోంది. జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డైలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు ఈ ప్రదేశంలో. దీంతో పాటు పలు ఇంటర్నేషనల్ వెంచర్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఇప్పుడు సలార్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. అక్కడి లోకల్ పోలీసులు సలార్ టీమ్‌కి సహకరిస్తున్నారు.
డ్రోన్స్, నైట్ షూటింగులు వేగంగా జరుగుతున్నాయి. రోమ్‌లోనూ, బుడాపెస్ట్ లోనూ సలార్ షూటింగ్ ఆల్రెడీ జరిగింది. తమ సంస్కృతులను, దూరాలను మర్చిపోయి ప్రేమలో పడ్డ ఇద్దరు వ్యక్తులు, వారి దేశాలు, సరిహద్దులు వారి ప్రేమకు ఎలాంటి అవాంతరాలు తెచ్చిపెట్టాయనే కథతో సలార్ ఉంటుందనే వార్తలూ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌లో తెరకెక్కుతోంది సలార్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
