ఇంట్లో 2 రోజులు ఉండి... ఆరు నెలలైంది! - రష్మిక
on Oct 24, 2019
తెలుగులో మహేష్ బాబుకు జంటగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ సరసన నటిస్తున్న 'భీష్మ'... కన్నడలో 'పొగరు', తమిళంలో కార్తీకి జోడీగా నటిస్తున్న సినిమా... ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. నాలుగూ సెట్స్ మీద ఉన్నాయి. వరుసపెట్టి షూటింగులు చేస్తున్నారు. దాంతో ఇంటికి వెళ్లే టైమ్ కూడా దొరకడం లేదని రష్మిక దీనంగా చెబుతున్నారు. గత ఆరు నెలల్లో ఇంట్లో పట్టుమని రెండు రోజులు కూడా లేనని చెప్పారామె. ఒక రోజు ఇంటికి వెళ్లారట. సరిగ్గా 22 గంటలు ఇంట్లో ఉన్నారట. ఈలోపు షూటింగ్ అని ఫోన్ రావడంతో మళ్ళీ సెట్స్ కు వచ్చేశానని రష్మిక అన్నారు. ఆమెకు ఓ చిట్టిచెల్లెలు ఉంది.ఇంటి నుండి వస్తున్న సమయంలో 'మళ్ళీ ఎప్పుడు వస్తావు?' అని అడిగిందట. ఫ్యామిలీ టైమ్ మిస్ అవుతున్నప్పటికీ... షూటింగుల్లో బిజీగా ఉండటం బావుందని రష్మిక సంతోషంగా చెబుతోంది. అల్లు అర్జున్ సరసన కూడా ఓ సినిమాలో ఆమె నటించనుంది.