ఫస్ట్‌లుక్ రివ్యూ: హాథీ మేరే సాథీ
on Jan 1, 2018
బాహుబలి సిరీస్ తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన రానా దగ్గుబాటి హీరోగా నిలదొక్కుకోవడానికి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గతేడాది ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న రానా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నాడు. దీనిలో భాగంగా 1971లో రాజేశ్ ఖన్నా హీరోగా తెరకెక్కిన హాథీ మేరే సాథీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న హాథీ మేరే సాథీలో రానా నటిస్తున్నాడు. న్యూఇయర్ సందర్భంగా అభిమానుల కోసం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఏనుగు తొండాన్ని పట్టుకుని నిలబడిన స్టిల్ ఆకట్టుకుంటోంది. ఇందులో బాందేవ్ అనే పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ ప్రభు సోలోమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళికి హాథీ మేరే సాథీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.