మెగా హీరో చిత్రంలో ముఖ్యమంత్రిగా...
on Mar 19, 2020
'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా దర్శకత్వంలో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ కథానాయకుడిగా ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. మొదట ఆ పాత్రకు విజయశాంతి అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారట. దర్శక నిర్మాతల ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారట. తర్వాత రమ్యకృష్ణను సంప్రదించడం, ఆమె అంగీకరించడం వెంటవెంటనే జరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఏలూరు నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయి తేజ్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. తాను చదువుకున్న ఆస్పత్రిలోనే డాక్టర్ గా ఉద్యోగం చేసే పాత్ర అట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 20 నుండి షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో, నెక్స్ట్ షెడ్యూల్ ఏలూరులో చేస్తారట. జూన్, జులై కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
