
వరల్డ్ సెల్యులాయిడ్ మరోసారి సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత రాముడి దివ్య దర్శనాన్ని చూడటానికి ముహూర్తం స్టార్ట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని థియేటర్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని 1 st తారీకు నుంచే స్టార్ట్ చేసాయి. దీంతో చాలా రోజుల తర్వాత థియేటర్స్ తమ లోపల బొమ్మని నడుపుతున్నా,లేకపోయినా అభిమానులు, రామ భక్తులతో సందడి వాతావరణం నెలకొని ఉంది.
దీంతో విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.తాజా నివేదికల ప్రకారం, 'రామాయణ' చిత్రం విడుదలకూ ముందే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలని సైతం విస్మయానికి గురిచేసింది. భారతదేశం వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 700 నగరాల్లో 59,463 షోలకు గానూ 18.46 లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కేవలం భారత్‌లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 72.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదైనట్లు బాక్సాఫీస్ ట్రాకర్లు ధృవీకరించారు. సాధారణ సీటింగ్‌తో పాటు ఆన్‌లైన్ బ్లాక్ చేసిన సీట్లతో కలిపి ఈ మొత్తం నమోదవ్వగా, కేవలం పక్కా కన్ఫర్మ్డ్ టిక్కెట్ల విలువ రూ. 57.60 కోట్లుగా ఉంది.
భాషల వారీగా వసూళ్లను పరిశీలిస్తే, హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో రూ. 59.60 కోట్లతో ఏకంగా 82 శాతం వాటాను సొంతం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో యష్ క్రేజ్ కారణంగా కన్నడ వెర్షన్ రూ. 6.06 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రాముడి కథపై ఉన్న అపారమైన ఆదరణతో 5.37 కోట్లు కలెక్ట్ కాగా, తమిళంలో 1.01 కోట్లు మరియు మలయాళంలో రూ. 22.27 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. నగరాల పరంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా10.42 కోట్లు, ముంబైలో 9.42 కోట్లు, బెంగళూరులో రూ. 8.07 కోట్లు మరియు హైదరాబాద్‌లో రూ. 4.57 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
ప్రత్యేకించి ప్రీమియం ఫార్మాట్లపై సినీ ప్రియులు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. IMAX, 4DX, Dolby, EPIQ మరియు ICE వంటి లగ్జరీ స్క్రీన్‌లలో 1,138 షోలకు గానూ రూ. 12.89 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ఇది మొత్తం దేశీయ వసూళ్లలో 18 శాతంగా నిలవడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ రామాయణ ప్రవాహం కొనసాగుతోంది. ఒక్క ఉత్తర అమెరికాలోనే తొలి 5 రోజుల వ్యవధికి గాను 1.40 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
.webp)
అక్కడ మొదటి ఐదు రోజుల్లోనే $13 మిలియన్ల నుండి $14 మిలియన్ల వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే రోజున ఈ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ లెక్కన 3 గంటల 15 నిమిషాల నిడివితో వస్తున్న ఈ మహాకావ్యం తొలి రోజే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సరిహద్దులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.దీపావళికి కోటి కాంతులు మన సొంతమైనట్టుగా ఈ నెల 5 న రాముడు అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
[Ramayana Movie Worldwide Advance Booking Collections, Ramayana Advance Booking Worldwide, Ramayana Box Office Collections, Ranbir Kapoor, Telugu Cinema, telugu Cinema news, Tollywood, Tollywood News]






