Home

»

Latest News

సినిమానా, తుఫానా: విక్టరీ ఎవరిది!

Nov 3, 2026 10:50AM

 

చాలా సినిమాల్లో విలన్ నోటి నుంచి ఒక ఫేమస్ డైలాగ్ వినుంటాం. బంగాళాఖాతంలో పడిన వాయుగుండం మరింతగా తన ఉధృతాన్ని చూపనుంది. దీంతో పెను తుఫాన్ పక్కా అని. ఇప్పడు ఆ సినిమానే రియల్ గా తుఫాన్ గండాన్ని మోయాల్సిన పరిస్థితి.    

ముఖ్యంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ'తో పాటు రీసెంట్‌గా ఎనౌన్స్ అయి మంచి క్రేజ్ తెచ్చుకున్న 'సీన్' సినిమాపై ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందనే చర్చ ఊపందుకుంది. గత కొన్ని నెలల సినీ గణాంకాలని పరిశీలిస్తే, టాలీవుడ్ తో పాటు బహుభాషా చిత్రాల బాక్సాఫీస్ వద్ద ప్రతివారం వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 60% నుండి 70% వరకు థియేటర్ల ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, దాదాపు 200  కోట్ల నుండి 300 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రావడం సాధారణంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న తుఫాన్ ప్రభావంతో మేకర్స్, ట్రేడ్ సర్కిల్స్ హడలెత్తిపోతున్నారు.
 

ఇది కూడా చదవండి : రామాయణ అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఇదే: ముఖ్యంగా ఏరియాలోనే అలా ఎందుకు! 

 

 

 

రామాయణ, సీన్ రెండు భారీ అగ్ర కాస్టింగ్  చిత్రాలే. ముఖ్యంగా రామాయణ కనివిని ఎరుగని బడ్జెట్ తో వస్తుంది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ముసురు వాతావరణం ఆవహించి ఉంది. ప్రత్యేకించి ఏపి తుఫాన్ హెచ్చరికతో ఉండగా, తెలంగాణ కూడా తుఫాన్ ప్రభావం ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నో తుఫాన్ లని సెల్యులాయిడ్ పై చూపించిన సినిమా ఇప్పడు తుఫాన్ భయంతో ఉంది. సినీ ప్రియులు మాత్రం ఐదవ తారీకుకి కల్లా మాములు వాతావరణం ఉంటుందని అంటున్నారు.   

 

[Murasu Cyclon effect On Movies, Cyclon effect Movies, Ramayana, Scene, Suriya, Ranbir Kapoor, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com