పవన్ రిటార్డ్ అంటూ తిట్టిన రాంగోపాల్ వర్మ..!
on Apr 12, 2016

పవన్ కళ్యాణ్ పై ఇక నుంచీ ట్వీట్ చేయను అంటూ పవన్ అభిమానులకు మాటిచ్చాడు రాంగోపాల్ వర్మ. అందుకే పవర్ స్టార్ పేరును ఉపయోగించకుండా, పవన్ పై ట్వీట్ చేశాడు. పవన్ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ తనపై చేసే ట్వీట్ల గురించి స్పందిస్తూ, వర్మ ఫ్రస్టేషన్లో ఉన్నాడంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి రెస్పాన్స్ గా వర్మ తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ పవన్ ను తిడుతున్నట్టుగా ఉంది.

ఒక ఎలివేటెడ్ సోల్ ను ఫ్రస్టేటడ్ సోల్ అని అపార్ధం చేసుకుంది ఒక రిటార్డెడ్ సోల్ అని ట్వీట్ చేశాడు. ఇవి పవన్ ను టార్గెట్ చేస్తూ అన్నవే అని అందరికీ తెలిసిందే. పవన్ పేరు ఉపయోగించను అని చెప్పిన కారణంగా, ఈ సారి పేరు ఉపయోగించకుండానే పవన్ ను రిటార్డెడ్ అని తిట్టాడు వర్మ. తన సినిమాలు తను చేసుకోక, పవన్ ను కెలకడం ఎందుకో..మళ్లీ ఇలా తిరిగి తిట్టుకోవడం ఎందుకో..ఏదేమైనా వర్మగారి శైలే వేరప్పా..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



