గ్యాంగ్‌స్టార్‌ను కోట్ల మంది ఎందుకు అభిమానిస్తున్నారు..అదే వర్మ "రాయ్"
on May 3, 2016

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి కొత్త డాన్ తయారవుతున్న సంగతి తెలిసిందే. మాజీ గ్యాంగ్‌స్టార్ "ముత్తప్పరాయ్" జీవిత కథ ఆధారంగా "రాయ్" అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు వర్మ. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని బెంగళూరులో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వర్మ మాట్లాడుతూ-"30 రూపాయలతో అతని జీవితం ప్రారంభమవుతుంది. 30 ఏళ్ల నేర జీవితంలో 30 వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇరవై హత్య కేసుల్లో నుంచి 21 నెలల్లో ఎలా బయటపడ్డాడు? 'నేరస్థుడి జీవితం చీకటి' అని చరిత్ర చెబితే, కాదు వేయి సూర్యుల వెలుగు అని ఎలా నిరూపించాడు? నేరాలు చేసిన అతణ్ణి కోట్ల మంది ప్రజలు ఎందుకు అభిమానిస్తున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది అని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



