పవన్ తో దాసరి సినిమా రెడీ అయిందా..!.!
on May 3, 2016

పవన్ కళ్యాణ్ తో దాసరి నారాయణరావు సినిమా ఎలా ఉంటుంది..? ఎవరు తీయబోతున్నారు.? దాసరి నిర్మాణంలో కమిటైన పవన్ సినిమాను చేస్తాడా..ఇవీ చాలా మంది అభిమానులకున్న ప్రశ్నలు. ప్రస్తుతం ఈ ప్రశ్నలపై ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ పవన్ ను మెప్పించే కథ, డైరెక్టర్ ను వెతికే పనిలో ఉన్న దాసరి, పవన్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ అయితేనే సరైన సరైన కథ రాస్తాడని భావించాడట. అయితే త్రివిక్రమ్ కథతో పాటు, సినిమా కూడా డైరెక్ట్ చేస్తానని దాసరికి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాపైనే దాసరి తన ఫోకస్ అంతా పెట్టారట. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన అవుట్ లైన్ ను రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడట. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. ఎస్ జే సూర్య డైరెక్షన్లో సినిమా చేస్తున్న పవన్, ఆ సినిమా షూటింగ్ ను వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి, త్రివిక్రమ్ సినిమాపై దృష్టి పెడతాడని అంటున్నారు. కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



