కీరవాణి ప్రశ్న.. వైరల్ అయిన ఆర్జీవీ జవాబు!
on Apr 26, 2020

రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదివరకు ఉన్నంత యాక్టివ్‌గా ఉండటం లేదు. కారణం, స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉండటం. ఈ మధ్యలో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఆయనకు ఓ ప్రశ్న వేశారు. దానికి ఆర్జీవీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
"1988లో ఆర్జీవీ ఒక పుస్తకాల పురుగుగా నాకు తెలుసు. ఇప్పుడాయన కరోనా పురుగును విశ్లేషించడంలో బిజీగా ఉన్నాడు. సర్, మీరింకా స్టీఫెన్ కింగ్‌ను చదువుతున్నారా?" అని తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ప్రశ్న సంధించారు కీరవాణి.
దానికి ఆసక్తికరమైన, అదే సమయంలో హాస్యభరితమైన సమాధానమిచ్చారు వర్మ. "నో సర్. ఎందుకంటే, స్టీఫెన్ కింగ్ తన రచనల్లో కల్పించిన దానికంటే వాస్తవిక జీవితం మరింత భయపెడుతోంది" అని ఆయన ట్వీట్ చేశారు.
పని విషయానికి వస్తే, వర్మ ప్రస్తుతం హైదరాబాద్‌లో హత్యాచారానికి గురైన దిశ ఉదంతం ఆధారంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు. ఇక కీరవాణి 'ఆర్ఆర్ఆర్' మూవీతో పాటు పవన్ కల్యాణ్ సినిమాకు సంగీత బాణీలు సమకూర్చే పనిలో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



