కరోనాపై పరిశోధనలకు హాలీవుడ్ స్టార్ రక్తదానం
on Apr 27, 2020

కరోనా... కోవిడ్-19... నావెల్ కరోనా.. ఏ పేరుతో పిలిస్తే ఏముంది? కంటికి కనిపించని ఈ శత్రువు దెబ్బకు ప్రస్తుతం ప్రపంచమంతా గడగడ వణుకుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని, చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయట పడిన వ్యక్తుల రక్తంలో దాన్ని చంపే యాంటీబాడీస్ ఉంటాయట. అందుకని, కరోనా నుండి కోలుకున్న వాళ్ళను రక్త దానం చేయమని బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, హృతిక్ రోషన్ వంటి వారు కోరుతున్నారు. కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కూతుళ్ళు జోయా, షాజా త్వరలో రక్తదానం చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, ఆయన సతీమణి రీటా విల్సన్ కూడా రక్తదానం చేయనున్నట్లు తెలిపారు. కరోనాపై పరిశోధనలకు తమ రక్తం ఉపయోగించవలసిందిగా ఆయన కోరారు. "మా రక్తంలో యాంటీబాడీస్ ఉన్నాయని తెలిసింది. మమ్మల్ని రక్త దానం చేయమని ఎవరు అడగలేదు. నేనే 'మా రక్తం కావాలా?' అని అడిగా. త్వరలో రక్తదానం చేస్తాం" అని టామ్ హాంక్స్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



