రొడ్డ కొట్టుడు అని బోయపాటిని పక్కనపెట్టాడా..?
on Jan 6, 2018
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సక్సెస్ టేస్ట్ చూసి చాలా కాలమైంది. ధృవ సినిమా బాగుందని పేరు తప్పించి.. వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో తన తర్వాతి ప్రాజెక్ట్‌లకు స్టార్ డైరెక్టర్లను ఎంచుకున్నాడు చెర్రీ. ప్రజంట్ సుకుమార్ దర్శకత్వంలో "రంగస్థలం 1985" చేస్తుండగా.. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను సినిమాలు లైనులో ఉన్నాయి. వీటిలో రాజమౌళి మూవీ ఇంకా అఫిషీయల్‌గా అనౌన్స్ అవ్వాల్సి ఉంది. అటాగే కొరటాల మూవీ జులై నుంచి షూటింగ్ జరుపుకుంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఇక ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు చెర్రీ.
దీనిలో భాగంగా బోయపాటి, చరణ్‌ని కలవడం కథ వినిపించడం.. దానికి మెగాపవర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయి.. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే అనుకున్న టైంలో.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బోయపాటి గతంలో తీసిన సినిమాల కథల్లో కొత్తదనం లేకపోవడం.. కేవలం క్రేజీ కాంభినేషన్ కారణంగా ఆయా సినిమాలు హిట్ అవ్వడంతో చెర్రీ ఆలోచనలో పడ్డాడట. దానికి తోడు ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కంటే కథాబలం ఉన్న సినిమాలే చేస్తోన్న చరణ్‌కు బోయపాటి డెవలప్‌చేసి ఇచ్చిన కథలో రొటీన్ సీన్స్ తప్ప కొత్తగా ఏం కనిపించలేదు. దీంతో వాటిని మార్చాలని కోరాడట చెర్రీ.. అప్పటి వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లదని ఫిలింనగర్ టాక్. మరి బోయపాటి సినిమాని చరణ్ పట్టాలెక్కిస్తాడా లేక పక్కనబెట్టేస్తాడా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.