టచ్ చేసి చూడు టీజర్ రివ్యూ
on Jan 6, 2018
రాజా ది గ్రేట్ తో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ టచ్ చేసి చూడు అంటున్నాడు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వస్తున్న టచ్ చేసి చూడు సినిమా టీజర్ ఈ రోజు విడుదలయింది. ఒక ఘర్షణలో అల్లరి మూకల్ని ఏరి పారేస్తూ సివిల్ డ్రెస్ లో కనిపిస్తాడు రవి తేజ. టీజర్ రన్ టైం కాసేపే అయినా, ఇంటరెస్టింగ్ గా ఉంది. రవి తేజ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల గుర్రాల పై కాప్స్ అతడ్ని అనుసరించడం కిక్కింగ్ గా అనిపిస్తుంది. ప్రీతమ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎలక్ట్రిఫయింగ్ గా ఉంది.
ఇక టీజర్ మొత్తానికి హైలైట్ అంటే, రవి తేజ లుక్. హ్యాండ్ సమ్ గా మరియు యంగ్ గా ఉన్నాడు మన మాస్ మహా రాజా. సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనివిందు చేయనున్న రవి తేజ సరసన రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు. రేస్ గుర్రం, మిరపకాయ్ మరియు కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సూపర్ హిట్ సినిమాలకి స్క్రీన్ ప్లే ఇచ్చిన విక్రమ్ టచ్ చేసి చూడు తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్ చూస్తుంటే, ఈ సినిమా మాస్ కి దగ్గరగా ఉండేలా ఉంది.