ప్రభాస్ 'జాన్'... రామ్‌చరణ్ హెల్ప్‌తో 20కోట్లు ఆదా
on Dec 19, 2019
రామ్‌చరణ్ హెల్ప్‌తో ప్రభాస్ 'జాన్' (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) నిర్మాతలకు ఇరవై కోట్లు ఆదా అయ్యాయి. అదెలాగో తెలుసా? ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ ఓ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యూరోప్ నేపథ్యంలో 1980 కాలంలో సాగే కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని తెల్లాపూర్ లో నాలుగు ఎకరాలు లీజుకు తీసుకుని సెట్స్ వేశారు. దీనికి కారణం రామ్ చరణ్.
సాధారణంగా రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల్లో సెట్స్ వేస్తారు. స్టూడియో రెంట్ రోజుకు సుమారు 70 వేల రూపాయలు ఉంటుంది. షూటింగ్ చేసినా... చేయకపోయినా... స్టూడియోలో సెట్ వేస్తే రెంట్ కట్టాల్సిందే. 'సైరా నరసింహారెడ్డి'కి స్టూడియోల్లో సెట్స్ వేయకుండా, కోకాపేటలోని సొంత స్థలంలో రామ్ చరణ్ సెట్స్ వేశారు. అందువల్ల, స్టూడియోకు కట్టే రెంట్ కంటే తక్కువ డబ్బుతో సెట్స్ వేశారు. రామ్ చరణ్ కు యువి క్రియేషన్స్ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ (విక్కీ) క్లోజ్. రామ్ చరణ్ సలహాతో 'జాన్'కు తెల్లాపూర్ లో ల్యాండ్ లీజుకు తీసుకుని సెట్స్ వేశారు. అక్కడ ఆరు కోట్ల రూపాయలతో నాలుగు సెట్స్ వేశారు. అవే సెట్స్ స్టూడియోల్లో వెయ్యాలంటే 25-30 కోట్లు ఖర్చు అవుతుందట. ఆ ల్యాండ్ లీజుకు తీసుకోవడంలో కూడా రామ్ చరణ్ హెల్ప్ ఉందని టాక్. అవుట్ డోర్ లో సెట్స్ వెయ్యడం వల్ల డబ్బు ఆదా అయ్యింది.