నితిన్ పెళ్లి అప్పుడేనా?
on Dec 19, 2019
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో నితిన్ ఒకడు. ఈమధ్య ఎక్కువగా ప్రేమకథల్లో నటిస్తుండడం వల్ల చూడడానికి ఇంకా ఎర్లీ ట్వంటీస్ కుర్రాడిలా కనిపిస్తాడు. కానీ, నితిన్ వయసు తక్కువ ఏం కాదు. ఇప్పుడు 36 సంవత్సరాలు. నితిన్ కంటే తక్కువ వయసున్న కొందరు హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పిల్లలకు తండ్రులు అయ్యారు. ప్రభాస్, రానా, నితిన్... ఇలా కొందరు పెళ్లి కాని ప్రసాద్ బ్యాచ్ లో మిగిలిపోయారు. త్వరలో ఈ బ్యాచ్ నుండి నితిన్ బయటకు వస్తున్నాడని ఫిలింనగర్ ఖబర్.
వచ్చే ఏడాది నితిన్ ఏడు అడుగులు వేయబోతున్నాడని, పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడని బలంగా వినిపిస్తోంది. కుమారుడి కోసం నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి వాళ్ళ కమ్యూనిటీలో ఒక సంబంధం చూశారట. అమ్మాయి డాక్టర్ అనీ, వచ్చే ఏడాది ఏప్రిల్ 15న దుబాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేశారని సమాచారం. ఈ పెళ్ళికి ఇండస్ట్రీ నుండి అతి తక్కువమందిని మాత్రమే ఆహ్వానిస్తారట. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిపించాలని నిర్ణయించారట. తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఇవ్వాలనుకుంటున్నారట.
Also Read