చరణ్ తో ప్రశాంత్ నీల్?
on Dec 7, 2020
కేజీఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు కన్నడ చిత్రసీమ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2ని పూర్తిచేసే పనిలో ఉన్న ప్రశాంత్.. జనవరి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ చేయబోతున్నారు. తన గత చిత్రాల తరహాలో ఇది కూడా యాక్షన్ మూవీగానే తెరకెక్కుతోంది.
కాగా, సలార్ తరువాత కూడా మరో పాన్ - ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్. ఈ సారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే దిశగా స్కెచ్ వేశారట. ఇప్పటికే ఇరువరి మధ్య చర్చలు జరిగాయని, దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లేనని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
వాస్తవానికి సలార్ తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య వినిపించింది. అయితే ఇప్పుడు చరణ్ తో ప్రశాంత్ సినిమా చేయబోతున్నట్లు కథనాలు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ కన్ ఫ్యూజన్ పై కూడా క్లారిటీ రావచ్చు.