హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి?
on Oct 31, 2015
రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన వసూళ్ళను రాబట్టంలో మాత్రం జోరును చూపించింది. చాలా మంది స్టార్ హీరోలు 40 కోట్లు అందుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంటారు. కానీ రామ్ చరణ్ బ్రూస్ లీ ఫ్లాప్ టాక్ తోనే అవలీలగా 40కోట్ల మార్క్ ను అందుకుంది. అప్పుడు ఈ సినిమా హిట్ లేదా సూపర్ హిట్ అనాలి. కానీ 'బ్రూస్‌లీ' ఫ్లాప్ మూవీ అంటున్నారు. తేడా ఎక్కడా వుంది? అంటే కాస్ట్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. అవసరానికి మించి ఖర్చు చేయడం వల్లే ఈ పరిస్థితి వస్తోంది. ఈ సినిమా సబ్జెక్టు కి చాలా తక్కువలో కూడా సినిమా తీయవచ్చని సినీ విశ్లేషకుల భావన. అనవసర ఖర్చు తగ్గించుకుని వుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు. ఏదిఏమైనా ఫ్లాప్ నుంచి మన నిర్మాతలు, దర్శకులు పాఠాలు నేర్చుకోవడం అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాల టాక్.