అయోమయ స్థితిలో సూపర్ స్టార్ !!
on Oct 31, 2015
తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ తెచ్చుకున్న విక్రమ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. ఐతే ఆ ఊపును అలాగే కొనసాగించలేక... వరుస ఫ్లాపులతో ఒక్కో మెట్టు దిగుతూ ఇప్పుడు అయోమయ స్థితిలో దిక్కులు చూస్తున్నాడు. అపరిచితుడు తర్వాత విక్రమ్ కు హిట్టన్నదే లేదు. మజా దగ్గర్నుంచి ఇటవలే వచ్చిన ‘10 ఎన్రదుకుల్లా’ వరకు అన్నీ ఫ్లాపులే.
'ఐ’ సినిమా విక్రమ్ ను ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకుంటే.. అతణ్ని మరింత కిందికి తొక్కేసింది. మూడేళ్లు ఆ సినిమా కోసం పడ్డ కష్టం ఫలితాన్నివ్వలేదు. అసలే కమర్షియల్ సినిమాలకు దూరమైపోతున్నాడనుకుంటే.. కెరీర్లో కీలకమైన మూడేళ్లు ‘ఐ’ సినిమాకు అంకితం చేసేయడం వల్ల మరింత వెనకబడిపోయాడు విక్రమ్.
10 ఎన్రదుకుల్లా సినిమాతో మళ్లీ కమర్షియల్ లీగ్ లోకి వచ్చేస్తాడనుకుంటే.. ఆ సినిమా కూడా నిరాశ పరిచి విక్రమ్ కెరీర్ ను మరింత అయోమయంలోకి నెట్టింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే.. ‘విక్రమ్’ మార్కెట్ ఎంతగా దెబ్బతిందో అర్థమైపోతోంది. ఇప్పుడు విక్రమ్ సూపర్ హిట్ ఎంతో అవసరం..మరి ఆ హిట్టిచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి!!