పూరి 'రొమాంటిక్' కోసం... ఇస్మార్ట్ శంకర్
on Dec 5, 2019
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. దర్శకుడిగా పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయితే... భారీ కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని పూరి ప్రకటించారు. అయితే, సీక్వెల్ కంటే ముందు ఇస్మార్ట్ శంకర్ మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు.
పూరి కోసం మరో సినిమాలో ఇస్మార్ట్ శంకర్ గా రామ్ కనిపించనున్నాడు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'రొమాంటిక్'. పూరి ఫాదర్ అండ్ సన్ కోసం ఈ సినిమాలో రామ్ అతిథి పాత్రలో నటించాడు. అదీ 'ఇస్మార్ట్ శంకర్'గా! 'రొమాంటిక్'లో 'ఇస్మార్ట్ శంకర్'గానే రామ్ కనిపించనున్నాడు. ఇటీవల గోవాలో ఆ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశాడని తెలిసింది. అన్నట్టు.... 'రొమాంటిక్'కు పూరి కథ అందించారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చాలా రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ వినిపించాయి. సినిమా కూడా టైటిల్ కి తగ్గట్టు ఉంటుందట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
