బాలకృష్ణ-బోయపాటి చిత్రానికి సంగీతం అతడే
on Dec 5, 2019
తెలుగు సినిమా సంగీతంలో తమన్ హవా నడుస్తోందిప్పుడు. అతడి పేరు మారుమోగుతోంది. డిసెంబర్లో 13న విడుదలవుతున్న 'వెంకీ మామ', 20న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'ప్రతి రోజూ పండగే' సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. చార్ట్ బస్టర్ ట్యూన్స్ 'సామజ వరగమన', 'రాములో రాములా'తో జనవరి 12న సంక్రాంతి కానుకగా వస్తున్న 'అల వైకుంఠపురములో' చిత్రంపై అంచనాలు పెంచాడు. రవితేజ 'డిస్కో రాజా'కు అతడే సంగీతం అందిస్తున్నాడు. మంచి మంచి పాటల అందిస్తుండటంతో పెద్ద సినిమాలకు తమన్ పేరు ఎక్కువ వినిపిస్తోంది. వరుసగా భారీ చిత్రాలకు పని చేస్తున్న తమన్, తాజాగా మరో భారీ చిత్ర్రానికి సంగీతం అందించడానికి సంతకం చేశాడని ఫిల్మ్ నగర్ టాక్.
'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కోసం రెడీ అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సినిమాకు తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారట. త్వరలో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ కానున్నాయని టాక్. సినిమా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
