కర్ణాటకలో కాలా మీద నిషేదం
on May 30, 2018

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రజనీకాంత్ కాలా సినిమాకి కర్ణాటకలో మాత్రం బ్రేక్ పడే అవకాశం ఉంది. కావేరి సమస్య మీద రజనీకాంత్ చేస్తున్నా వ్యాఖ్యలకు నిరసనగా కాలాను కర్ణాటకలో విడుదల చేయకూడదంటూ అక్కడి సినిమా పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. రజనీకాంత్‌కు కన్నడ పరిశ్రమతో ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది. కానీ ఇరు రాష్ట్రాల మధ్యా నడుస్తున్న కావేరీ వివాదం మీద అప్పుడప్పుడూ ఆయన చేసే వ్యాఖ్యలు తలనొప్పులు సృష్టించేవి. ఈమధ్య కూడా కావేరీ బోర్డుని నియమించాలనీ, నదీజలాలను తమిళనాడుకి తరలంచాలనీ డిమాండ్ చేశారు. ఫలితమే కన్నడనాట కాలా నిషేదం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



