పదేళ్ల చిన్నవాడితో ప్రియాంక డేటింగ్
on May 30, 2018
.jpg)
హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించిన క్వాంటికో సీరియల్ ఏమంత విజయవంతం కాలేదు. దాంతో క్వాంటికోని అర్థంతరంగా ఆపేశారు. కానీ ఈలోగా ప్రియాంక కావల్సినంత పాపులారిటీని మాత్రం సంపాదించుకుంది. సెబాస్టియన్, టామ్ హిడెల్‌సన్ వంటి హాలీవుడ్ నటులతో డేటింగ్ చేస్తున్న వార్తలూ గుప్పుమన్నాయి. అవేంటో కానీ ఇప్పుడు మాత్రం నిక్ జోనస్ అనే కుర్రవాడితో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా అంతా పుకారు లేస్తోంది. ప్రియంక కంటే నిక్ పదకొండేళ్ల చిన్నవాడట. ఈమధ్య ఎక్కడ చూసినా వారిద్దరూ మంచి పార్టీమూడ్‌లో ఉన్న చిత్రాలు బయటకి వస్తున్నాయి. ప్రియాంక మాత్రం తమ మధ్య ఏదో ఉందని కానీ, ఏదీ లేదని కానీ స్పష్టం చేయడం లేదు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



