పాతికేళ్ల విజయం కలిసొచ్చేనా..!
on May 19, 2017
.jpg)
సరిగ్గా పాతికేళ్ల క్రిందట అగ్ర కథానాయకులు సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లను జతకట్టి అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'దళపతి 'చిత్రం భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తో తిరుగులేని స్టార్లుగా ఎదిగిపోయారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మరో సంచలన చిత్రం రాబోతుననట్లు వినికిడి. తాను తయారు చేసుకున్నకొత్త కథకు వారిద్దరు అయితేనే సరిపోతారని భావించిన మణిరత్నం వారితో మళ్ళీ సినిమా చేయాలని నిర్ణయించాడని వినిపిస్తున్నది.
పాతికేళ్ల క్రిందటి 'దళపతి'ని తలపించేలా మణిరత్నం ఈ చిత్రాన్ని తీయనునట్లు ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ గొప్ప త్రయం తీయబోతున్న కొత్త సినిమా వార్త ఇప్పుడు దావానలంగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిత్రం పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈముగ్గురు ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ముందున్న చిత్రాలు పూర్తికాగానే ఈ చిత్రం పట్టాలెక్కవచ్చు. ఈ ముగ్గురు ఈ చిత్రం పై ఎవరు ముందు స్పందిస్తారో చూడాలి మరి. ఈ విషయం మాత్రం అభిమానుల్లో ఆనందాన్ని ఇచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



