రజనీ కాంత్ ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశాడా..!
on May 17, 2016
రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ లో ఎప్పుడు ఏది సెన్సేషన్ సృష్టిస్తుందో చెప్పలేం. ప్రస్తుతం వీరప్పన్ పై సినిమా తీస్తున్న వర్మ, అతని జీవితంపై చాలా రీసెర్చ్ చేశాడు. వీరప్పన్ కుటుంబంతో పాటు అతనితో పనిచేసిన వారందరినీ కలిసి ఎన్నో వివరాలు సేకరించాడు. ఈ ప్రోసెస్ లోనే, వీరప్పన్ రజనీకాంత్ ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాడని వర్మకు తెలిసిందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
వీరప్పన్ తనను తాను రజనీకాంత్ కంటే చాలా గొప్పవాడిననుకునేవాడని, ఆయన్ను కిడ్నాప్ చేసి తన జీవితంపై సినిమా తీయమని డిమాండ్ చేయాలని ఆలోచించాడని వర్మ చెబుతున్నాడు. ఈ సెన్సేషనల్ ట్వీట్ ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే తరహాలో రజనీని కిడ్నాప్ చేయాలని ఆలోచించాడట మీసాల వీరప్పన్. అయితే అది అతనికి కుదరలేదు. తాజాగా వర్మ బాలీవుడ్ లో తీస్తున్న తన వీరప్పన్ సినిమాలో ఈ విశేషాల్ని పెడదామనుకుంటున్నాడట. అసలు ఇలాంటి మారుమూలు విషయాలన్నీ వర్మకు భలేగా దొరుకుతాయే...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
