‘రాజాసాబ్2’ ఉంటుందా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
on Aug 6, 2025
సినిమాలకు సీక్వెల్స్ ఉండడం అనేది సహజం. తెలుగులో కూడా గతంలో చాలా సీక్వెల్స్ వచ్చాయి. అయితే స్టార్ హీరోల సినిమాలను కూడా సీక్వెల్స్‌గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే కాన్ఫిడెన్స్‌ని తీసుకొచ్చిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలంతా సీక్వెల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఒక భాగంతో కాకుండా దాదాపు 5 గంటలపాటు సాగే విస్తృత కథలను సిద్ధం చేసుకుంటున్నారు డైరెక్టర్లు. బాహుబలి ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పటికే చాలా సిరీస్ వచ్చాయి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. అతను చేసే సినిమా తప్పకుండా రెండు భాగాలుగా ఉండాలి అనే అభిప్రాయం దర్శకనిర్మాతల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉంది. బాహుబలి తర్వాత సలార్, కల్కి చిత్రాలకు కూడా రెండో భాగాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రానికి కూడా సీక్వెల్ ఉందనే ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్2 తప్పకుండా ఉంటుందని, అయితే అది మొదటి భాగానికి కొనసాగింపుగా ఉండదని, రెండో భాగం మరో కథతో ఉంటుందని తెలిపారు. అయితే సినిమాకి సంబంధించిన థీమ్ మాత్రం ఒకేలా ఉంటుందని మాత్రం తెలియజేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్‌కి 22 మిలియన్ వ్యూస్ రాగా, అదే స్థాయిలో హిందీ టీజర్‌కి 11 మిలియన్ వ్యూస్ లభించాయి. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. అయితే ప్రభాస్ అభిమానులు, ట్రేడ్ వర్గాలు జనవరి 9న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా బాగుంటుందని అంటున్నారు. కానీ, డిసెంబర్ 5న రిలీజ్ చెయ్యాలని హిందీ ప్రేక్షకులు కోరుతున్నారని నిర్మాత చెబుతున్నారు. ఏది ఏమైనా తాము అనుకున్న డేట్‌కే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత అంటున్నారు. అక్టోబర్ నాటికి సినిమా టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుందని విశ్వప్రసాద్ తెలిపారు. ‘రాజాసాబ్’ చిత్రంలో ఒక కొత్త ప్రభాస్ కనిపించబోతున్నారన్న విషయం టీజర్‌లోనే తెలిసింది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు తొలిసారి నటించడం విశేషం. ఒక కీలక పాత్రలో సంజయ్‌దత్ కనిపిస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



