'వార్-2' నుంచి ఒకేసారి మూడు అప్డేట్లు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బి రెడీ!
on Aug 6, 2025

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'వార్-2' (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మూడు అదిరిపోయే అప్డేట్ లు వచ్చాయి.
ఎన్టీఆర్, హృతిక్ లపై చిత్రీకరించిన 'సలాం అనాలి' సాంగ్ గ్లింప్స్ రేపు(ఆగస్టు 7) విడుదల కానుంది. ఈ సాంగ్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీడియో సాంగ్ లను సినిమా రిలీజ్ కి ముందే విడుదల చేసే ఆనవాయితీ బాలీవుడ్ లో ఉంది. అయితే 'సలాం అనాలి' సాంగ్ విషయంలో మాత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతుంది. గ్లింప్స్ ను మాత్రమే ఇప్పుడు విడుదల చేసి, ఫుల్ సాంగ్ కోసం థియేటర్లకు రావాలి అంటోంది.

'సలాం అనాలి' సాంగ్ అప్డేట్ తో పాటు.. 'వార్-2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాని తెలుగునాట విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత నాగవంశీ.. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. "ఈ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. అనుమతులు వచ్చిన తరువాత పూర్తి వివరాలను ప్రకటిస్తాము." అని అన్నారు.
ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర'ను కూడా తెలుగునాట నాగవంశీనే విడుదల చేశారు. ఈ విషయాన్ని కూడా నాగవంశీ ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో దేవరకు మించిన భారీ విడుదల చేస్తామని ఎన్టీఆర్ అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే, బుకింగ్స్ కూడా ఆదివారం ఓపెన్ అవుతాయని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



