రాజ్ తరుణ్ అంత అడుగుతున్నాడా..!
on Jun 10, 2016
కుర్రహీరోల్లో చాలా స్పీడుగా తెరపైకి దూసుకొచ్చాడు రాజ్ తరుణ్. చేసినవి ఐదు సినిమాలే అయినా, ఈ యువహీరో హిట్ ట్రాక్ బాగానే ఉంది. ముఖ్యంగా కుమారి 21ఎఫ్ తర్వాత మనోడికి క్రేజ్ బాగా పెరిగింది. ఈ సినిమాకు 10 లక్షల వరకూ తీసుకున్నాడట. సుకుమార్ సినిమా అంటే రెమ్యునరేషన్ తో పనేముందిలే అని సినిమా చేసేశాడు. అయితే ఆ తర్వాత రామయ్య అందాలు, సీతమ్మ సిత్రాలు యావరేజ్ గా ఆడితే, మల్టీ స్టారర్ ఈడో రకం ఆడో రకం మంచి హిట్టయింది. దీంతో ఈ కుర్రాడికి సక్సెస్ కిక్ ఎక్కిందట. పది లక్షలు తీసుకునేవాడు కాస్తా, ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాడట.
దీంతో పెద్ద పెద్ద నిర్మాతల సినిమాలు కూడా కోల్పోతున్నాడు. మనోడితో సినిమా చేద్దామనుకున్న దిల్ రాజు సినిమా, అల్లు అరవింద్ లాంటి వాళ్లందరూ వేరే హీరోలకు షిఫ్ట్ అవుతున్నారట. అయితే ఇద్దరు నిర్మాతలు మాత్రం అడిగినంత ఇవ్వడానికి ముందుకొచ్చారని, వాళ్ల సినిమాలు చేస్తున్నాడని సమాచారం. రెమ్యునరేషన్ అనేది మార్కెట్ ప్రకారం ఉంటుంది. తన సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని అడిగితే తప్పు లేదు. కానీ ప్రస్తుతానికి చిన్న సినిమాలు మాత్రమే చేసే ఈ కుర్ర హీరో అంతంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని సినిమాలు హిట్టై, మార్కెట్ రేంజ్ పెరిగితే, ఇతనిపై పెట్టింది మనకు తిరిగొస్తుంది అని నిర్మాతలు నమ్మితే, కోటి రూపాయలు అవే వస్తాయి. అంతే కాని కెరీర్ కు బాటలు పడుతున్న ఈ సమయంలో రెమ్యునరేషన్ తో సినిమాలు వదులుకోవడం తెలివైన పని కాదు. ఏమంటావ్ యంగ్ హీరో..?