బాలయ్య ఇంకా బాలకృష్ణుడేనట..!
on Jun 10, 2016
ఈసారి తన బర్త్ డే అమెరికాలో జరుపుకుంటున్నారు నటసింహం నందమూరి బాలయ్య. అయితే ఆయన దగ్గర లేకపోయినా, ఫ్యాన్స్ మాత్రం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపారు. బాలయ్య బర్త్ డే వేడుకల కోసం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు వచ్చిన ఆమె, గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి, ఆయన మనస్తత్వం గురించి మాట్లాడారు బ్రాహ్మణి. ఆయనకు వయసు పెరిగే కొద్దీ మరింత చిన్న పిల్లాడిలా మారుతున్నారని, నిత్య యవ్వనుడిలా దూసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. " నాన్న తన మనవడితో ఆడుతున్నప్పుడు పూర్తిగా చిన్న పిల్లాడిలా మారిపోతారు. ఆయన ఇప్పుడు 57లోకి అడుగుపెడుతున్నా, ఆయనలో ఆ వయసు కనిపించదు. మానవ సేవే మాధవ సేవ అని చిన్నప్పటి నుంచి నాన్న మాకు చెప్పేవారు. ఆయనకు బిడ్డగా పుట్టడం అదృష్టం అన్నారు నారా బ్రాహ్మణి ". ఆమెతో పాటు గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ టీం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారులతో కేక్ కట్ చేయించారు బ్రాహ్మణి. ఇక రాష్ట్రమంతటా కూడా బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శాతకర్ణితో తమ హీరో చరిత్ర లిఖిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.