రహస్యం ఇదమ్ జగత్ మూవీ రివ్యూ
on Dec 26, 2024
మూవీ : రహస్యం ఇదమ్ జగత్
నటీనటులు: రాకేశ్, స్రవంతి, మానస వీణ, భార్గవ్, కార్తీక్ తదితరులు
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
మ్యూజిక్: గ్యాని
సినిమాటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్
ఓటీటీ: ఈటీవి విన్
కథ:
అభి (రాకేశ్) విదేశాలలో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి అకీరా (స్రవంతి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన తండ్రి చనిపోవడంతో, అకీరా ఇండియా వెళ్లడానికి సిద్ధమవుతుంది. అకీరాను విడిచి తను ఉండలేనని భావించిన అభి, ఆమెతో పాటు తను కూడా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అంతకుముందు ఇద్దరు కలిసి సరదాగా కార్లో ఒక ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ లో అరుణి, కళ్యాణ్, విశ్వతో పరిచయమవుతుంది. తప్పనిసరి పరిస్థితులలో వాళ్లంతా ఒకరాత్రి ఒక ఇంట్లో ఉండవలసి వస్తుంది. 'అరుణి' కి టైమ్ ట్రావెల్ .. వామ్ హోల్ .. మల్టీ యూనివర్స్ అనే అంశాలపై అవగాహన ఉంటుంది. అందుకు సంబంధించిన విషయాలపై ఆమె పరిశోధన కూడా చేస్తుంటుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. అభి, విశ్వ మధ్య గొడవకి కారణమేంటి? అరుణి చేసిన ప్రయోగం ఏంటి? అకీరాకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ ని లింక్ చేస్తూ ఓ చిన్న ప్రేమకథని చూపించాలనుకున్నాడు దర్శకుడు. అయితే ఇది సామాన్య ప్రేక్షకుడి ఊహాశక్తికి మించి ఉంటుంది. అంటే మొదటగా విశ్వ ఎందుకు హీరో మీద కోపంగా ఉంటాడో అర్థం కాదు. ఆ తర్వాత అరుణి మాటలని అలా ఎలా నమ్ముతుంటారో అర్థం కాదు. సినిమాని స్కిప్ చేసి చూస్తే అసలేం అర్థం కాదు.. స్కిప్ చేయకుండా చూసే అంత ఓపికా ఎవరికీ ఉండదు.
సినిమా మొదలవ్వగానే ఇదేదో డాక్యుమెంటరీలా ఉందే అనిపిస్తుంది. ఓ నలభై నిమిషాల తర్వాత అమెరికాలో ఉండే కొంతమంది తెలుగువాళ్ళు కలిసి షార్ట్ ఫిల్మ్ తీసి దానిని యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేశారా అనిపిస్తుంది. అంత స్లోగా ఉంది. మధ్యలో మైథలాజికల్ ని ఎందుకు తీసారో? సైన్స్ ఫిక్షన్ ను ఎందుకు వాడారో మేకర్స్ కే తెలియాలి. ఒకానొక సందర్భంలో ఏదీ నిజం.. ఏది ప్రస్తుతం అర్థం కాదు.. గజిబిజి సుడోకు పజిల్ లా స్క్రీన్ ప్లే సాగుతుంది.
కథలోని పాత్రల పర్ఫామెన్స్ పెద్దగా ప్రభావం చూపకపోవడం.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం పెద్ద మైనస్. మైథలాజికల్ అంశం బాగున్నప్పటికి దానికి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మేకర్స్ ఇంకా జాగ్రత్త వహించాల్సింది. కొన్ని హాలివుడ్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి ఇన్ స్పైర్ తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ మధ్య కారణాలు లేకుండా గొడవలు పడటం.. కొన్ని సీన్లు ఎందుకున్నాయో అర్థం కాదు. అడల్డ్ సీన్లు లేవు. గ్యానీ మ్యూజిక్ ఓకే. టేలర్ బ్లూమెల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
రాకేశ్ పాత్రలో అభి, స్రవంతి పాత్రలో అకీరా ఆకట్టుకున్నారు. అరుణిగా మానస వీణ తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఓపికకి పరీక్ష పెట్టే రహస్యం ఇదమ్ జగత్
రేటింగ్: 1.75 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read