మన్మోహన్ సింగ్ మృతిపై చిరంజీవి ట్వీట్
on Dec 27, 2024
భారతదేశపు పదమూడవ ప్రధానమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలని ప్రవేశపెట్టి, ప్రజల యొక్క స్థితి గతులని మార్చేసిన రాజకీయ ఉద్దండుడు మన్మోహన్ సింగ్(manmohan singh) రెండు పర్యాయాల పదవి కాలంలో మాటలతో కాలక్షేపం చెయ్యకుండా చేతలతో తన సత్తా చాటి అంతర్జాతీయంగా భారతదేశపు యొక్క కీర్తి పతాకాన్ని మరింతగా విశ్వవ్యాప్తం చేసాడు.
అంతటి మహోన్నత వ్యక్తి అయిన మన్మోహన్ సింగ్ నిన్న ఢిల్లీ లోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సోషల్ మీడియా వేదికగా మన్మోహన్ సింగ్ మరణంపై స్పందిస్తూ దేశంలో ఉన్న గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు.వరుసగా రెండు సార్లు ప్రధానిగా పని చేసిచరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు.అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడుగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మన దేశానికి కూడా అయన మృతి తీరని లోటు.ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసాడు.
ఇక మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26 న ప్రస్తుత పాకిస్థాన్ ప్రొవిజన్స్ లోని 'గా' అనే గ్రామంలో జన్మించాడు. ఆయనకి ముగ్గురు సంతానం కాగా భార్య పేరు గురుశరన్ కౌర్ కొహ్లీ.