రాఘవేంద్రుడు మల్టీస్టారర్!
on May 23, 2019
'ఓం నమో వేంకటేశాయ' తరవాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టలేదు. 'బాహుబలి' (చిత్ర సమర్పకుడిగా వ్యవహరించారు) తరవాత ఆయన నిర్మాణంలోనూ సినిమా రాలేదు. కొంత విరామం తరవాత ఆయనో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు కథానాయికలతో ఒక సినిమా చేయబోతున్నానని పుట్టినరోజు (మే 23) సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? లేక నిర్మాతగా మాత్రమే ఉంటారా? అనేది చెప్పలేదు. త్వరలో చెబుతానన్నారు. సినిమా కాకుండా వెబ్ సిరీస్ కోసం మూడు కథలు సిద్ధం చేశానని రాఘవేంద్రరావు తెలిపారు. సో... త్వరలో దర్శకేంద్రుడి నుంచి సినిమా ఆశించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
