తక్కువ గ్యాప్ లోనే నాని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!
on Jan 31, 2022
.webp)
అన్నీ అనుకూలిస్తే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు సినిమాలతో సందడి చేయడం నేచురల్ స్టార్ నాని శైలి. అయితే, `గ్యాంగ్ లీడర్` (2019), `వి` (2020), `టక్ జగదీశ్` (2021).. ఇలా వరుసగా మూడేళ్ళ పాటు సెప్టెంబర్ నెలల్లోనే నాని వరుస చిత్రాలు జనం ముందు నిలిచాయి. అంటే.. ఏడాది, అంతకుమించి గ్యాప్ ఆ సినిమాల మధ్య ఉందన్నమాట. ఇదిలా ఉంటే.. మళ్ళీ ఇప్పుడు పాత పంథాలోనే వెళ్ళే దిశగా నాని ప్రయత్నాలు చేస్తున్నాడు. సంవత్సరం తిరిగేసరికి నాలుగు సినిమాలతో నాని సందడి చేయనుండడమే ఇందుకు నిదర్శనం.
ఆ వివరాల్లోకి వెళితే.. `టక్ జగదీశ్` విడుదలైన మూడు నెలల తరువాత `శ్యామ్ సింగ రాయ్`తో ఎంటర్టైన్ చేసిన నాని.. ఆపై తన నెక్ట్స్ వెంచర్ `అంటే సుందరానికీ!`ని వేసవిలో షెడ్యూల్ చేశాడు. ఏప్రిల్ లో ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా థియేటర్స్ లోకి రాబోతున్నట్టు టాక్. అంటే.. మరో నాలుగైదు నెలల్లో నాని కొత్త సినిమా లైన్ లో ఉన్నట్టే. ఆనక ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `దసరా`ని ఆగస్టులో రిలీజ్ చేయడానికి స్కెచ్ వేస్తున్నాడట. అంటే.. మళ్ళీ నాలుగు నెలల్లోనే నాని నుంచి ఇంకో సినిమా రాబోతున్నట్టే. మొత్తంగా.. `టక్ జగదీశ్`, `శ్యామ్ సింగ రాయ్`, `అంటే సుందరానికీ!`, `దసరా` ఇలా ఏడాది తిరిగేసరికి నాలుగు సినిమాలతో నాని ఎంటర్టైన్ చేయబోతున్నట్లే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



