Home

»

Latest News

'పుష్ప' ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ట్రైలర్ విడుదల వాయిదా!

Dec 6, 2021 5:11PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న‌ రెండు భాగాల 'పుష్ప' మూవీలోని ఫ‌స్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' ట్రైల‌ర్ ను సోమ‌వారం సాయంత్రం 6:03 గంట‌ల‌కు విడుదల చేస్తామని ఇటీవల మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో పుష్ప ట్రైలర్ కోసం ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ట్రైలర్ విడుదల వాయిదా పడిందంటూ చివరి నిమిషంలో మూవీ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హైవోల్టేజ్ ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాలో ఎర్ర‌చంద‌నాన్ని స్మ‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా నెవ‌ర్ బిఫోర్ 'రా లుక్‌'లో క‌నిపిస్తున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే "త‌గ్గేదే లే" అంటూ ఆయ‌న చెప్పిన ఊత‌ప‌దం ఎంత వైర‌ల్‌ అయ్యిందో మాట‌ల్లో చెప్ప‌లేం. టీవీ షోల‌లోనూ, బ‌య‌టా కూడా ఆ ప‌దాన్ని విప‌రీతంగా వాడుతూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో భుజాన్ని పైకెగ‌రేస్తూ బ‌న్నీ ప్ర‌ద‌ర్శించిన మేన‌రిజం కూడా ఆడియెన్స్‌ను తెగ అల‌రించింది. ఇటీవల విడుదలైన పుష్ప ట్రైలర్ టీజ్ కూడా ఆకట్టుకుంది. దీంతో ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా చెప్పిన సమయానికి ట్రైలర్ విడుదల చేయలేకపోతున్నామని తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది.

Also Read: 'పుష్ప' ట్రైలర్ టీజ్.. అంచనాలకు మించి ఉంది!

పుష్ప ట్రైలర్ ఆలస్యమైనా ఈరోజే విడుదలవుతుందా? లేక మరేదైనా తేదీలో విడుదలవుతుందా? అనే విషయంపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com