Home

»

Latest News

2021 జ్ఞాప‌కాలుః `బౌన్స్ బ్యాక్` భామలు!

Dec 07, 2021

2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో కొంత‌మంది క‌థానాయిక‌లు మ‌ళ్ళీ విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచారు. `బౌన్స్ బ్యాక్` అయిన ఆ తార‌ల వివ‌రాల్లోకి వెళితే..

శ్రుతి హాస‌న్ః- ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్.. `ప్రేమ‌మ్` (2016)తో చివ‌రిసారిగా స‌క్సెస్ చూశారు. ఆపై `కాట‌మ‌రాయుడు`(2017)తో భంగ‌ప‌డ్డ శ్రుతి.. ఈ ఏడాది సంక్రాంతికి సంద‌డి చేసిన `క్రాక్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. అలాగే అతిథి త‌ర‌హా పాత్ర‌లో న‌టించిన `వ‌కీల్ సాబ్`తోనూ విజ‌యం చూశారు.

పిల్ల‌ల చ‌దువు ఖ‌ర్చులు నావి.. మిగ‌తా ఖ‌ర్చుల‌న్నీ మా ఆయ‌న‌వి!

సాయిప‌ల్ల‌విః- `ఫిదా`, ఎంసీఏ` చిత్రాల‌తో 2017లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టిన డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి.. ఆ త‌రువాత ఆ స్థాయి మ్యాజిక్ కొన‌సాగించ‌లేక‌పోయింది. `క‌ణం`, `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`, `మారి 2` (2018), `ఎన్జీకే` (2019).. ఇలా ప‌ల్ల‌వి న‌టించిన‌ స్ట్ర‌యిట్, డ‌బ్బింగ్ మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ ని మెప్పించ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ లో సంద‌డి చేసిన `ల‌వ్ స్టోరి`తో మ‌రోమారు ఘ‌న‌విజ‌యం అందుకున్నారీ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

అరెస్ట్ కానున్న జాక్వ‌లిన్‌?

అంజ‌లిః- తెలుగ‌మ్మాయి అంజ‌లి టాలీవుడ్ లో స‌క్సెస్ చూసి చాన్నాళ్ళే అయింది. `గీతాంజ‌లి` (2014) త‌రువాత అంజలి న‌టించిన సినిమాలేవీ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. ఈ సంవ‌త్స‌రం రిలీజైన‌ `వ‌కీల్ సాబ్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ చూశారు అంజ‌లి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో అల‌రించారు అంజలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com