డైనమిక్ హీరోతో డాషింగ్ డైరక్టర్ `జన గణ మన`!!
on Jul 22, 2019
గతంలో `జన గణ మన` అనే చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా పూరి చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు పూరి. అయితే ఆ తర్వాత స్టోరి నచ్చకనో, మరే ఇతర కారణాల వలనో కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇక ఆ తర్వాత పూరి వేరే హీరోలతో సినిమాలు చేసినా కానీ అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంకర్ ` చేశాడు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాతో పూరి సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. అయితే పూరి తదుపరి సినిమా గురించి ప్రజంట్ సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే...గతంలో మహేష్ తో చేయాలనుకున్న `జన గణ మన` సినిమాను సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట పూరి. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది క్రేజీ ప్రాజెక్ట్ గా నిలవడం ఖాయం అంటున్నారు చిత్ర పరిశ్రమ వారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత నెక్ట్స్ సినిమాను గురించి పూరి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఎలా ఉంటుందో మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
