పూరి,విజయ్ సేతుపతి మూవీపై వైరల్ కామెంట్స్..బెగ్గర్ అంటారా!
on Apr 2, 2025
దర్శకుడుగా పూరిజగన్నాధ్(puri Jagannadh)కి ఉన్న ట్రాక్ రికార్డు అందరకి తెలిసిందే.ఎన్నోహిట్లు,సూపర్ హిట్లు,బ్లాక్ బస్టర్స్ ఆయన సొంతం.కొన్ని పరాజయాల తర్వాత 'ఇస్మార్ శంకర్'తో తన స్థాయికి తగ్గ హిట్ ని అందుకున్నాడు.కానీ ఆ తర్వాత వచ్చిన లైగర్,డబుల్ ఇస్మార్ట్ దారుణ పరాజయాన్ని చవి చూశాయి.దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ క్రమంలోనే తమిళ బడాస్టార్ 'మక్కల్ సెల్వం విజయసేతుపతి'(Vijay Sethupathi)తో మూవీ ప్లాన్ చేసాడు.ఉగాది సందర్భంగా అధికారకంగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.ఇప్పుడు ఈ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తు'పూరి జగన్నాధ్ అవుట్ డే టెడ్ అయ్యాడు కదా! మహారాజా వంటి హిట్ తర్వాత పూరితో విజయ్ సేతుపతి ఎలా సినిమా చెస్తున్నాడంటు పోస్ట్ చేసాడు.ఈ కామెంట్ పై ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కొడుకు నటుడైన శాంతను భాగ్యరాజ్ స్పందిస్తు ఇండస్ట్రీలో వ్యక్తుల గురించి అలా మాట్లాడకండి.పూరి లాంటి ప్రముఖ దర్శకులకి సరైన గౌరవం ఇవ్వండని రిప్లయ్ ఇచ్చాడు.ఆ తర్వాత సదరు నెటిజెన్ సారీ చెప్పి తన మెసేజ్ ని డిలీట్ చెయ్యడం జరిగింది.
పూరి,విజయ్ సేతుపతి కాంబోపై ఇరువురి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది.'మహరాజ' తమిళ,తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లోను సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, విజయ్ సేతుపతి కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని సాధించింది.చైనా(Chaina)లో కూడా రికార్డు కలెక్షన్స్ ని రాబట్టి విజయ్ సేతుపతి ఇమేజ్ ని రెట్టింపు చేసింది.ఈ నేపథ్యంలో పూరి తన సత్తా చాటడానికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.బెగ్గర్ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
