ప్రభాస్ తో దిశాపటాని ఫిక్స్ అయ్యిందా!
on Apr 1, 2025
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)'దిరాజాసాబ్'(The Raja saab)తో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ ఏకధాటిగా పాల్గొంటు వస్తున్నాడు.ప్రేక్షకులని మాత్రం ముందుగా రాజా సాబ్ తో పలకరించనున్నాడు.ఈ మూవీ ద్వారా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ జోనర్ ని టచ్ చేస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా రాజాసాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
హను రాఘవపూడి మూవీ విషయానికి వస్తే పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరక్కబోతుంది.ప్రభాస్ తో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి(Imanvi)జత కడుతుంది.ఇప్పుడు ఇమాన్వి కాకుండా ఇంకో హీరోయిన్ కి కూడా చోటు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani)ఆ ప్లేస్ లో చెయ్యబోతుందనే టాక్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోను చక్కర్లు కొడుతుంది.మేకర్స్ దిశా పటానితో సంప్రదింపులు జరిపారని,ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుందని తెలుస్తుంది.
దిశాపటాని ప్రభాస్ తో ఇంతకు ముందుకు కల్కి 2898 ఏడి లో కలిసి చేసింది.ఇద్దరి ఫెయిర్ కి ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది.దీంతో రెండోసారి ఈ జంట ప్రేక్షకులని తమ నటనతో కనువిందు చేయనుంది.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)ప్రభాస్ కెరీరి లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.దిశాపటాని గత ఏడాది సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువా'లో కనిపించిన విషయం తెలిసిందే.ఆమె సినీ ఆరంగ్రేటం కూడా పూరి,వరుణ్ కాంబోలో వచ్చిన లోఫర్ చిత్రం ద్వారానే జరిగింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
