కోర్టులోనే జర్నలిస్ట్‌పై చేయి చేసుకున్న హీరో
on Jan 27, 2017

సినీ తారలకు, జర్నలిస్ట్‌లకు అవినాభావ సంబంధం ఉంటుంది..సెలబ్రిటీల సినిమా విశేషాల దగ్గరి నుంచి పర్సనల్ విషయాల వరకు ప్రతి దాన్ని బయట పెట్టేయాలనుకుంటారు జర్నలిస్ట్‌లు..ఆ ఉత్సాహం కొన్ని సార్లు వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో పులకిట్ సామ్రాట్ ఫోటో జర్నలిస్ట్‌పై కోర్టు ఆవరణలోనే చేయి చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
పులకిట్‌కు ఆయన భార్య శ్వేతా రోహిరకు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి బొంబే హైకోర్టుకు వచ్చాడు. న్యాయస్థానం లోపల పని ముగించుకుని పులకిట్ బైటకు వస్తుండగా ఒక ఫోటో జర్నలిస్ట్ ఆయనను క్లిక్‌మనిపించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన సామ్రాట్ సదరు ఫోటోగ్రాఫర్‌పై చేయి చేసుకున్నాడు..ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన అజ్ఞాత వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త చర్చనీయాంశమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



