ప్రతిరోజూ పండగే... కథపై చిన్న డౌట్
on Dec 5, 2019

ఓ మనిషి చావును కూడా ఓ ఉత్సవంలా, పండగలా సెలెబ్రేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి మదర్, హీరో సాయి తేజ్ అమ్మమ్మ అంజనాదేవి విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూశాక... ప్రేక్షకుల వచ్చే డౌట్ ఒక్కటే. ఇదేదో 'శతమానం భవతి' కాన్సెప్ట్ లా ఉందే అని!
'శతమానం భవతి'లో విదేశాల్లో స్థిరపడిన పిల్లలను సొంతూరు రప్పించడం కోసం, కన్నతల్లికి చూపించడం కోసం 'మీ అమ్మకు విడాకులు ఇస్తున్నాను. మీరు వచ్చి ఎవరో ఒకరు తీసుకువెళ్ళండి' అని ప్రకాష్ రాజ్, తన పిల్లలకు ఈ-మెయిల్ చేస్తాడు. 'ప్రతిరోజూ పండగ' ట్రైలర్ చూస్తే... తనకు కాన్సర్ అని విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు సత్యరాజ్ మెయిల్ చేస్తాడు. దాంతో రెండు కథలకు దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయేమో, 'శతమానం భవతి' కథను కాస్త మార్చి 'ప్రతిరోజూ పండగే'లా మారుతి తీస్తున్నాడు ఏమో అని సందేహాలు వచ్చాయి. బహుశా... మారుతికి అటువంటి సందేహమే వచ్చి ఉంటుంది. అందుకని, ట్రైలర్ చివరలో రావు రమేష్ చేత ఒక డైలాగ్ చెప్పించారు.
టిక్ టాక్ లో ఫేమస్ అయిన అమ్మాయి ఏంజెల్ ఆర్నగా రాశీ ఖన్నా క్యారెక్టరైజేషన్, సత్య రాజ్, రావు రమేష్ నటన, సాయి తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్... మారుతి కామెడీ టైమింగ్... 'ప్రతి రోజు పండగే' ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



